మహా సముద్రం అనేది భూమి యొక్క జలావరణంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ మహా సముద్రాలు భూమి ఉపరితలం మీద 71% పైగా విస్తరించి ఉన్నాయని ఒక అంచనా. ఈ మహా సముద్రాలు మొత్తం వైశాల్యం 36.1 కోట్ల చదరపు కిలోమీటర్లు ఉంది. మహాసముద్రాలు అన్నీ కలసి ఉన్నప్పటికీ, అవి విస్తరించి ఉన్నా ఖండాలను బట్టి వాటిని వేరువేరు పేర్లతో విభజించారు. భూమి ఉపరితలం పైన ఉన్న విశాలమైన ఉప్పునీటి జలావరణాలనే మహాసముద్రాలు అని పిలుస్తాము.
మహా సముద్రాలు మొత్తం 5, అవి ఏమిటంటే (5 Maha samudralu names in Telugu)
1. పసిఫిక్ మహాసముద్రం
2. అట్లాంటిక్ మహాసముద్రం
3. హిందూ మహాసముద్రం
4. ఆర్కిటిక్ మహాసముద్రం
5. అంటార్కిటిక్ మహాసముద్రం
1. పసిఫిక్ మహా సముద్రం (Pacific Ocean in telugu)
ఈ మహా సముద్రం భూమి మీద ఉన్న అన్నీ సముద్రాల కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ సముద్రాన్ని పోర్చుగీసుకు సంబందించిన ఫెర్డినాండ్ మాగెల్లాన్ అనే నావికుడు కనుగొన్నాడు.
ఈయన పసిఫిక్ మహాసముద్రాన్ని కనుగొని దానికి” మేర్ పసిఫిక్” అని నామకరణం చేశాడు. ఈ పేరుకు ప్రశాంతమైన సముద్రం అనే అర్థం వస్తుంది. పసిఫిక్ మహా సముద్రంలో అలలు తక్కువగా ఉన్నందున దీన్ని ప్రశాంతమైన సముద్రంగా కూడా పరిగణిస్తారు.
పసిఫిక్ మహా సముద్రానికి పశ్చిమంగా 200 కిలోమీటర్ల దూరంలో మారియన్ అని పిలువబడే ఒక ద్వీపం ఉన్నది. ఈ ద్వీపంలో మారియాన అని పిలువబడే ఒక కందకం కలదు. ఈ కందకం ప్రపంచంలోనే అత్యంత లోతైన కందకం గా పిలవబడుతున్నది, దీని లోతు సుమారు 35,797 అడుగులు ఉంటుంది.
ఈ పసిఫిక్ మహా సముద్రంలో న్యూగినియా అనే ఒక పెద్ద దీవి కూడా కలదు. ఈ పసిఫిక్ మహా సముద్రంలో ఆస్ట్రేలియా తీరాన గల బ్యారియర్ రీఫ్ అని పిలువబడే ద్వీపం కూడా కలదు. ఇది సముద్రంలో ఏర్పడిన సహజమైన రాతి గుట్ట.
పసిఫిక్ మహాసముద్రంలో పెట్రోలియం మరియు సహజ వాయువులు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు.
ఈ పసిఫిక్ మహాసముద్రంలో అనేక జాతుల చేపలు మరియు జల ప్రాణులు ఉన్నట్లుగా గుర్తించారు.
దక్షిణ మరియు తూర్పు ఆసియా దేశాల నదుల నుంచి వెలువడే కలుషితమై నీరు ఈ సముద్రం లో చేరడం వలన ఈ సముద్రం సముద్రజీవులకు సురక్షితం కాదని తేలింది.
2. అట్లాంటిక్ సముద్రం (Atlantic Ocean in telugu)
భూమి మీద ఉన్న అన్ని సముద్రాలలో కల్లా అట్లాంటిక్ మహా సముద్రం రెండవదిగా పరిగణిస్తున్నారు. ఈ సముద్రం యూరప్ మరియు ఆఫ్రికా ఖండాల నుండి దక్షిణ అమెరికా ఖండంను వేరు చేస్తూ వెళుతుంది. అట్లాంటిక్ అనే గ్రీకు రాక్షసుని పేరు ఆధారంగా ఈ సముద్రంకు గ్రీకులు అట్లాంటిక్ అనే పేరును పెట్టారు.
మొత్తం భూభాగంలో ఈ సముద్రం 20 శాతం అనగా 10,64,00,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించి ఉందని అంచనా.
అట్లాంటిక్ సముద్రం అన్ని సముద్రాల కంటే చివరిగా ఏర్పడిన సముద్రంగా బావిస్తారు. అమెరికా ఉనికిని కొలంబస్ అట్లాంటిక్ మహా సముద్రం మీద ప్రయాణించే కనుక్కున్నాడు.
ప్రపంచ మాయా ట్రయాంగిల్ గా పిలవబడే బెర్ముడా ట్రయాంగిల్ అట్లాంటిక్ సముద్రం లోనే ఉన్నది. ఈ బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో అనేక నౌకలు మరియు విమానాలు అదృశ్యమైనట్లు కనుగొన్నారు.
ఈ అట్లాంటిక్ మహాసముద్రంలో పెట్రోలియం మరియు గ్యాస్ ఉత్పత్తులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించారు. విలువైన రాళ్ళు మరియు అనేక రకాల సముద్రపు జీవులు మరియు చేపలకు ఈ సముద్రం ఆవాసంగా ఉన్నది.
మరియు అంతరించిపోతున్న సీల్స్, తిమింగలాలు, సముద్రపు తాబేలు, డాల్ఫిన్లు , సముద్రపు సింహాలుకు కూడా ఈ మహాసముద్రం ఆవాసంగా ఉన్నది.
పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, కాలుష్యం మరియు నగరాల నుంచి వెలువడే చెత్త చేదరాల వల్ల, ఓడలు మరియు నౌకల నుంచి వెలువడే ఆయిల్ వలన ఈ సముద్రం కాలుష్యం బారిన పడుతుంది.
3. హిందూ మహాసముద్రం (Indian Ocean in Telugu)
ఈ ప్రపంచంలోకెల్లా మూడవ అత్యంత పెద్దదైన సముద్రం.
ఇది సుమారు 70,560,000 చదరపు కిలోమీటర్లు వరకు వ్యాపించి ఉన్నది.
మొత్తం భూగోళం పై 19.8% భూమి ఈ సముద్రం యొక్క నీటిచే నింపబడి ఉన్నది.
ఈ సముద్రానికి ఉత్తరాన ఆసియా ఖండం, పశ్చిమాన ఆఫ్రికా ఖండం ,తూర్పున ఆస్ట్రేలియా ఖండం సరిహద్దులుగా ఉన్నాయి.
ఈ సముద్రానికకి దక్షిణాన అంటార్కిటికా మహా సముద్రం కలదు.
ఈ సముద్రంలో ఆస్ట్రేలియా సముద్ర సింహాలు, బ్లూ వేల్, సముద్ర తిమింగలం, ఇరావతి డాల్ఫిన్, ఇండియన్ ఓషన్ హంప్‌బ్యాక్ డాల్ఫిన్, గ్రీన్ సీ తాబేలు, వంటి సముద్ర జీవులు కలవు.
4. అంటార్కిటిక్ మహాసముద్రం (Arctic Ocean in Telugu)
ఈ మహాసముద్రం ప్రపంచంలోని మహాసముద్రాల కెల్లా నాలుగవ పెద్ద మహా సముద్రం. దీనిని దక్షిణ మహాసముద్రం అని మరియు Austral Ocean అని కూడా పిలుస్తారు.
ఈ మహాసముద్రం ప్రపంచ సముద్రాలలోని ఎక్కువ దక్షిణ భాగాన్ని కలిగి ఉంది.
ఈ మహాసముద్రం సుమారు 270 మీటర్ల లోతును కలిగి ఉంటుంది.
ఈ సముద్రం అంటార్కిటిక్ ఖండం చుట్టూ ఆవరించి ఉన్నది, కావున దీనిని అంటార్కిటిక్ మహాసముద్రము అని పిలుస్తారు.
ఈ సముద్రంలో -2 నుంచి 10 డిగ్రీల సెంటిగ్రేడ్ మరియు 28 నుంచి 50 డిగ్రీల ఫారన్హీట్ ల మధ్య ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది.
అంటార్కిటిక్ సముద్రంలో వాయు తుఫాన్లు తూర్పు వైపునకు ఖండం చుట్టూ ప్రయాణించి తీవ్రరూపం దాల్చుతాయి. దీనికి కారణం మంచు మరియు విశాల సముద్ర ఉష్ణోగ్రతల మధ్య గల వ్యత్యాసాలే కారణం.
ఈ అంటార్కిటికా సముద్రతీరం ఎల్లప్పుడూ మంచుచే కప్పబడి ఉంటుంది.
మంచు కొండల్లోని గ్లేషియర్లు కరగడం వలన దక్షిణ మహాసముద్రానికి (అంటార్కిటిక్) నీరందుతుంది.
5. ఆర్కిటిక్ మహాసముద్రం (Antarctic ocean in Telugu)
ఈ ఆర్కిటిక్ మహాసముద్రం ఉత్తరార్థ గోళంలో ఉత్తర ధృవానికి దగ్గరలో ఉంటుంది.
ఇది ప్రపంచం లోని సముద్రలన్నింటిలో కల్లా ఐదవ పెద్ద మహాసముద్రంగా పిలవబడుతున్నది.
ఈ మహాసముద్రం యురేషియా మరియు ఉత్తర అమెరికాలలో ఆవరింపబడి ఉన్నది. సంవత్సరం పొడవునా ఈ ఆర్కిటిక్ మహాసముద్రం చాలాభాగం మంచుచే కప్పబడి ఉంటుంది.
ఈ ఆర్కిటిక్ మహాసముద్రం యెక్క లవణ గాఢత మరియు ఉష్ణోగ్రత రుతువులను అనుసరిస్తూ మార్పు చెందుతూ ఉంటుంది.
ఈ మహాసముద్రం ఉత్తరార్థ గోళంలో పూర్తిగా 14.75 మిలియన్ చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది.
మహాసముద్రాలు అన్నింటికంటే పసిఫిక్ మహాసముద్రం చాలా పెద్దదిగా పరిగణిస్తాము.
ఆర్కిటిక్ సముద్రాన్ని అత్యంత చిన్న సముద్రంగా పరిగణిస్తాము.
ఉత్తరార్థ గోళంలో భూభాగం దక్షిణార్థ గోళంలో జలభాగం ఎక్కువగా ఉంటాయి.
ఈ Maha Samudralu తో పాటుగా కొన్ని ఇతర సముద్రాలూ కూడా ఉన్నాయి.
ఇప్పుడు ఆ సముద్రాలు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి తెల్సుకుందాం…………..
నల్ల సముద్రం: ఈ నల్ల సముద్రం యూరప్ లో కలదు.
తెల్ల సముద్రం: ఇది ఉత్తర రష్యా లో కలదు.
ఎర్ర సముద్రం: దీనిని భూ పరివేష్టిత సముద్రము అని కూడా అంటారు.
జావా సముద్రం: ఇది పసిఫిక్ మహాసముద్రం లో ఒక భాగం.
దక్షిణ చైనా సముద్రం:ప్రపంచ లోనే అతి పెద్ద సముద్రం దక్షిణ చైనా సముద్రం
బేరింగ్ సముద్రం: ఈ బెరింగ్ సముద్రం పసిఫిక్ మహాసముద్రం కు ఉత్తరాన కొనసాగింపుగా కలదు.
మెడిటేరియన్ సముద్రం: ఈ సముద్రం యూరప్, ఆసియా మరియు ఆఫ్రికా ఖండాల మధ్య కలదు.
కరీబియన్ సముద్రం: ఈ కరేబియన్ సముద్రము దక్షిణ అమెరికా మరియు క్యుబాలకు మధ్యలో కలదు.
అడ్రియాటిక్ సముద్రం: ఇటలి బల్కన్ ద్వీపాల మద్యన కలదు.
కాస్పియన్ సముద్రం: ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా ఈ కాస్పియన్ సముద్రంని పిలుస్తారు.
ఈ తరం పిల్లలకు ఇవన్నీ చదివించండి మరియు ఎప్పటికి గుర్తుండేలా నేర్పించండి.
పక్షాలు (రెండు) – ( ఇక్కడ చదవండి)
తెలుగు నెలలు – పన్నెండు ( ఇక్కడ చదవండి)
Chinnappudu social teacher cheppina lesson gurtukochindi…. Thank you so much. Very nice blog. Keep continue.