హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా ఫేమస్ అయిన Nellore chepala pulusu ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
అసలు చేపల పులుసు పుట్టిందే నెల్లూరులో అని ఎప్పుడూ మా అమ్మమ్మ చెబుతూ ఉంటుంది.
చెప్పడం మర్చిపోయాను మాది కూడా నెల్లూరే అందువలన నెల్లూరు అని పేరు వినబడితే చాలు ఏదో చెప్పలేని అభిమానం.
చేపల పులుసు నెల్లూరులో చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఈ Nellore chepala pulusu కి చాలా మంచి పేరు ఉంది. దీని రుచికి ఫిదా అవ్వని వారంటూ ఎవరూ ఉండరు. నెల్లూరు సముద్రతీర ప్రాంతంలో ఉండటం వలన ఇక్కడ చేపలు, రొయ్యలు, పీతలు మొదలగు సీఫుడ్స్ ఎక్కువగా దొరుకుతాయి.
మా అమ్మమ్మ చేతి చేపల పులుసు చాలా రుచిగా ఉంటుందని మాకు తెలిసినవాళ్లు మరియు బంధువులు అందరూ అంటూ ఉంటారు. నేను మా అమ్మమ్మ దగ్గర నుండి ఈ చేపల పులుసు ను ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాను. ఇంకా ఎన్నో రకాల పాతకాలం నాటి కూరలు, పచ్చళ్ళు ఎలా చేయాలో నేర్చుకున్నాను. వాటి తయారీ విధానం కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను.
ముందుగా ఈ నెల్లూరు చేపల పులుసు తో నా ఈ వంటల ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను.
Ingredients for Nellore chepala pulusu
కావలసిన పదార్థాలు:
1. ముందుగా చేపలని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇందులో గండి, బొచ్చె వంటి చేపలు పులుసు చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు ఎందుకంటే అవి చాలా రుచిగా ఉంటాయి.
2. చింతపండు , ఒక కేజీ చేపకి సుమారు 150 నుంచి 200 గ్రాములు చింతపండు పడుతుంది.
3. కారం మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవచ్చు.
4. పసుపు చిటికెడు
5. కరివేపాకు రెండు రెమ్మలు
6. కొత్తిమీర రెండు రెమ్మలు
7. నూనె, 1 కేజీ చేపలకు 100 గ్రాముల నూనె పడుతుంది.
8. ఉల్లిపాయలు, ఒక కేజీ చేపల కి మూడు పెద్ద ఉల్లిపాయలు పడతాయి.
9. టమాటా, ఒక కేజీ చేపలకి మూడు నుంచి నాలుగు టమాటాలు తీసుకోవాలి.
10. పులుసులో పొడి ,3 టేబుల్ స్పూన్లు.
Prepare powder for Nellore chepala pulusu
పులుసులో పొడి తయారీ విధానం:
Buy Best Karam Powder for Nellore Chapala Pulusu
చేపల పులుసు కి రుచి పెంచడానికి నెల్లూరులో ప్రత్యేకంగా ఈ పొడిని ఉపయోగిస్తారు, ఇంకా చెప్పాలంటే ఈ పొడిలోనే ఉంది చేపల పులుసు రుచి అంతా……..
పొడి తయారీకి కావలసిన పదార్ధాలు:
ధనియాలు : 100 గ్రాములు.
ఆవాలు : 1 టేబుల్ స్పూన్.
మెంతులు: 1/2 టేబుల్ స్పూన్.
బియ్యం: 2 టేబుల్ స్పూన్.
జీలకర్ర:1 టేబుల్ స్పూన్.
Buy Best Bowl for Chepala Pulusu Prepartion Online
ముందుగా ధనియాలు, బియ్యంని పాన్ లో వేసి వేయించుకోవాలి. తరువాత ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి సన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం మాడిన కూడా కూర రుచి మారిపోతుంది. తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి ఒక నెల వరకు నిలవ చేసుకోవచ్చు. చేపల పులుసు కాకుండా ఇతర పులుసులలో కూడా ఈ పొడిని ఉపయోగించుకోవచ్చు.
Preparation of Nellore chepala pulusu
ఇప్పుడు చేపల పులుసు తయారీ విధానం:
ముందుగా 150 నుండి 180 గ్రాముల అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి.
తరువాత శుభ్రం చేసుకున్న చేపలకి ముందు చెప్పిన కొలతలతో ఉప్పు, కారం, పసుపు సమపాళ్ళలో చేపల కి పట్టించి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత మూడు పెద్ద ఉల్లిపాయలు, మూడు పెద్ద టమాటాలను తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో వంద గ్రాముల నూనె పోసి బాగా కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వాలి, ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగాక టమాటా వేసుకొని మూత పెట్టి బాగా మగ్గించాలి.
టమాటా మరియు ఉల్లిపాయ మిశ్రమం బాగా గుజ్జులా అయిన తరువాత, ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని పులుసులా చేసుకుని ఇందులో పోసి బాగా ఉడకనివ్వాలి, పులుసు బాగా ఉడుకుతున్న సమయంలో, ఉప్పు కారం, పసుపు వేసి పక్కన పెట్టుకున్న చేపలను ఈ పులుసులో వేసి మంట సిమ్ లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. చేపలని మరీ ఎక్కువగా ఉడికిస్తే అవి విరిగిపోయి కూరలో కలిసిపోతాయి మరియు కూరని మాటి మాటికి గరిటతో కలియపెట్టరాదు, ఇలా చేయడంవల్ల ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంది కనుక.
చేపలు వేసిన తర్వాత రుచి చూసి సరిపోకపోతే మీ రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి ఉడకనివ్వాలి. ఇక పులుసును దించబోయే రెండు నిమిషాల ముందు, ముందుగా తయారు చేసుకున్న పులుసులో పొడిని మూడు టేబుల్ స్పూన్స్ వేసి ఒక నిమిషం ఉడికించి, చివరిగా కరివేపాకు కూరలో వేసి దింపేయాలి. అంతే వేడి వేడి nellore chepala pulusu రెడీ, ఈ పులుసుని కనుక అన్నంలో వేసుకుని తింటే దీని రుచికి మీరు కచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే , అంత బాగుంటుంది ఈ చేపల పులుసు. ఇందులో మీకు కావాలంటే చిన్న సైజు వంకాయలు కానీ మామిడికాయ కానీ వేసి వండుకోవచ్చు.
Nellore chepala pulusu తయారీలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
చేపల పులుసు తయారీకి ఎంచుకునే పాత్ర వెడల్పాటిది అయి ఉండాలి, ఇలాంటి పాత్రలో వండటం వలన ముక్కలు విరిగిపోకుండా గరిటెతో తీసుకోవడానికి వీలుగా ఉంటాయి.
చేపల కూరని ఉడికించుకునేటప్పుడు చేపలను గరిటతో కలియ పెట్టకుండా, గిన్నెను చిన్నగా అటు ఇటు తిప్పుతూ పులుసు చేపల మీద పడేలా ఉడికించుకోవాలి.
బయట దొరికే ధనియాల పొడిని ఈ చేపల పులుసు లో ఎట్టి పరిస్థితుల్లో వేయరాదు ఎందుకంటే ఈ nellore chepala pulusu రుచి మారిపోతుంది.
ఈ నెల్లూరు చేపల పులుసు ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి, మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి.
Related topic: Ulavala uses in Telugu.