260 Telugu Samethalu Whatsapp కోసం
కొన్ని ముఖ్యం గా ఉపయోగించే తెలుగు సామెతలు (260) అమ్మమ్మ నుంచి సేకరించి ఇక్కడ తెలుగులో అన్ని అక్షరాల్తో ఇవ్వడం జరిగింది.
క అక్షరం తో Telugu Samethalu Whatsapp కోసం
1. కాకిలా కలకాలం బ్రతికేకంటే హంసలా ఆరు నెలలు బ్రతికేది నయం.
2. కాశీకి పోతూ శనీశ్వరం నెత్తిన పెట్టుకొని పోయినట్టు.
3. కాసు ఉంటె మార్గం ఉంటుంది.
4. కాయా పండా.
5. కాలికేస్తే మెడకి మెడకివేస్తే కాలికి.
6. కుక్క నోటికి టెంకాయ అతకదు.
7. కుక్క కాటుకు చెప్పు దెబ్బ.
8. కుక్క తోక వంకర.
9. కూటి కోసం కోటి విద్యలు.
10. కూర్చుని తింటే కొండలైన కరుగుతాయి.
Buy a Book of Telugu Samethalu Online
11. కొత్తోకా వింత పాతొక రోత.
12. కొండనాలికకి మందువేస్తే ఉన్న నాలిక ఊడిందంట.
13. కొండకు వెంట్రుక వేసి లాగినట్టు.
14. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు.
15. కోతి తోకకి నిప్పంటించి నట్టు.
16. కోతి చేతికికొబ్బరి చిప్ప ఇచ్చినట్లు.
17. కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు.
18. కాకి పిల్ల కాకికి ముద్దు.
19. కుక్కను తెచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టినట్టు.
20. కుక్క తోక వంకర.
21. కుక్కతోక పట్టుకొని గోదారీదినట్టు.
22. కంచు మోగినట్లు కనకంబు మ్రోగునా.
23. కోడి ముందా గుడ్డు ముందా.
24. కోటిలింగాలలో బోడిలింగం.
25. కంప మీద బట్టలు ఆరేసి నట్టు.
26. కాకి ముక్కుకి దొండ పండు.
27. క్షేమంగా వెళ్లి లాభంగా రండి.
28. కూరలో కరివేపాకు లాగా.
29. కోటి విద్యలు కూటి కొరకే.
గ అక్షరం తో Telugu Samethalu Whatsapp కోసం
30. గతిలేనమ్మకు గంజే పానకము.
31. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్లు.
32. గాలీ వాన గంగ జాతర కూతురు పెళ్లి కుప్పనురుపుల్లు.
33. గుడినే మింగేవాడికి లింగమొక లెక్క.
34. గ్రుడ్డి కన్నా మెల్ల మేలు.
35. గుండెల్లో గునపం దించినట్టు.
36. గుండె కలిగిన వాడు కండ కలిగిన వాడు.
37. గుడ్డెద్దు చెలో పడ్డట్టు.
38. గుండెల మీద కుంపటి.
39. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడట.
40. గురువుకి పంగనామాలు పెట్టినట్లు.
41. గుడ్డోచి పిల్లని ఇక్కిరించినట్టు.
42. గురువుని మించిన శిస్యుడు.
43. గొడ్డుని చూసి గడ్డేయాలి.
44. గోటితో పొయ్యే దాన్ని గొడ్డలిదాకా తెచ్చినట్టు.
45. గోడలకు చెవులుంటాయి.
46. గోడమీది పిల్లి.
47. గుడ్డ కింద పందికొక్కు.
48. గుడిని గుడిలో లింగాన్ని మింగినట్లు.
49. గాడిద చాకిరీ చేసి నట్టు.
50. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు. ఇల్లు అలకగానే పండగ కాదు.
51. గొఱ్ఱె కసాయి వాడినే నమ్ముతుంది.
52. గోడకు కొట్టిన సున్నం లాంటిది.
చ అక్షరం తో Telugu Samethalu in Telugu language
53. చితికి నిప్పు పెట్టినట్టు.
54. చింతకాయలమ్మేదానికి సిరిమాణం వస్తే ఆ వంకర టింకర కాయలు ఏంటివి అని అడిగిందట.
55. చింత చచ్చిన పులుపు చావలేదు.
56. చిట్టిడు వేస్తే పుట్టెడు వేగుతాయి.
57. చిదిమి దీపం పెట్టొచ్చు.
58. చూసి రమ్మంటే కాల్చోచాడు.
59. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.
60. చెడపకురా చెడేవు.
61. చెడి చేలోకి పోతే మరొక చేరడు వేయమన్నాడంట.
62. చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టు.
63. చెవిలో తెనేపోసినట్టు.
64. చెప్పులో రాయి చెవిలో జోరీగ.
65. చెప్పులోని రాయి చెవిలోని జోరీగ.
66. చక్కనమ్మ చిక్కినా అందమే.
67. చాపకింద నీరులాగా.
68. చీకట్లో బాణం.
జ అక్షరం తో Telugu Samethalu Whatsapp కోసం
69. జుట్టు ఉన్నమ్మ ఏ కొప్పి ఐన పెడతాది.
70. జోగి జోగి రాసుకుంటే రాలేది బూడిదే.
71. జుట్టు జుట్టు ముడి వేసినట్టు.
72. జిత్తుల మారి నక్క.
డ మరియు త అక్షరాలతో Telugu Samethalu
73. డబ్బాలో రాళ్ళువేసి గులకరిచ్చినట్టు.
74. డబ్బుకు లోకం దాసోహం.
75. తలలో నాలుకలాగా.
76. తాన అంటే తందానా అన్నట్లు.
77. తా చెడ్డ కోతి వనమంతా చెడిచింది.
78. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు.
79. తీగ లాగితే డొంక కదిలినట్లు.
80. తీగికి కాయ బరువా తల్లికి బిడ్డ బరువా.
81. తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత.
82. తేట తెల్లనా.
83. తెడ్డు ఉండంగా చెయ్యి ఎందుకు కాల్చుకోవడం.
84. తెల్లనివన్ని నీళ్ళు కాదు నల్లనివన్ని పాలు కాదు.
85. తడిసి మోపుడయ్యింది.
86. తడిసి ముప్పన్న మోసినట్టు.
87. తేలు కుట్టిన దొంగలాగా.
88. తామరాకు మీద నీటిబొట్టు లాగా.
89. తడిగుడ్డతో గొంతు కోసినట్లు.
90. తేనె పూసిన కత్తి.
91. తానా అంటే తందానా అన్నట్లు.
92. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నిరోజులు ఉంటుంది.
93. తులసి వనంలో గంజాయి మొక్క.
ద అక్షరం తో Telugu Samethalu Whatsapp కోసం
94. దరిద్రుడి పెళ్ళికి వడగండ్ల వాన.
95. దరిధ్రుడికి ఆకలెక్కువ, ధనవంతుడి ఆశ ఎక్కువ.
96. దయగల మొగుడు తలుపువేసి కొట్టాడంట.
97. దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు.
98. దిన దిన గండం దీర్ఘాయిస్సు.
99. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.
100. దురాశ దుఃఖానికి చేటు.
101. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు.
102. దొంగకు దొంగ బుద్ది దొరకు దొర బుద్ది.
103. దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్లు.
104. దొరికితే దొంగలు దొరక్కపోతే దొరలు.
105. దరిద్రుడికి ఆకలెక్కువ, ధనవంతునికి ఆశ ఎక్కువ.
106. దగ్గుతూపోతే సొంటి ఫిరమ్.
107. దండం దశ గుణం భవత్.
108. దెబ్బకి దెయ్యం వదిలినట్టు.
109. దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు.
110. దేవునికే గతి లేకపోతే పూజారి వచ్చి మొరపెట్టుకున్నట్టు. గాడిద కేమి తెలుసు గంధపు వాసన.
111. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.
న అక్షరం తో Telugu Samethalu Whatsapp కోసం
112. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.
113. నవ్వు నాలుగు విధాలా చేటు.
114. నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగవాడిని నమ్మకూడదు.
115. నిమ్మకు నీరు ఎత్తినట్లు.
116. నింగికీ నేలకు నిచ్చెన వేసినట్లు.
117. నిండుకుండ తొణకదు.
118. నిదానమే ప్రదానం.
119. నిజం నిప్పులాంటిది.
120. నిప్పులేనిదే పొగ రాదు.
121. నిజం నిలకడ మీద తేలుతుంది.
122. నిజమైన రంకులాడికి నిష్టలెక్కువ.
123. నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు.
124. నెమలి కి నాట్యం నేర్పినట్టూ.
125. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.
126. నోరు మాట్లాడుతుంటే నోసులు ఇక్కిరించినట్టు.
127. నీరు పల్లానికే పారును.
128. నదులన్నీ సముద్రంలో కలసినట్టు.
129. నక్క తోక తొక్కినట్టు.
130. నిండు కుండ తొనకదు.
131. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్లు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
132. నవ్విన నాపచేనే పండినట్టు.
133. నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు.
134. నారదమహర్షి లా ఉన్నావే.
ప అక్షరం తో Telugu Samethalu in Telugu language
135. పప్పులో కాలేసినట్టు.
136. పట్టపగలే చుక్కలు చూపిస్తా.
137. పందికి చావమన్నా గియ్యే బతకమ్మన్నా గియ్యే.
138. పరాయి సొమ్ము పామువంటిది.
139. పంచ పాండవులు ఎంతమంది అని అడిగితె మంచం కోల్లులా ముగ్గురు అని రెండు వేళ్ళు చూపించాడంట.
140. పరిగెత్తి పాలు త్రాగేకంటే నిలబడి నీళ్లు త్రాగేది మేలు.
141. పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు.
142. పచ్చి ఏలక్కాయ్యి గొంతులో పడ్డట్టు.
143. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు.
144. పండిత పుత్రః పరమశుంఠహ.
145. పానకంలో పుడక.
146. పాపమని పాతచీర ఇస్తే గోడచాటుకి వెళ్లి మూర వేసిందంట.
147. పాపమని పట్టుచీర ఇస్తే చింపి ఒడియాలు పెట్టిందట.
148. పిల్లిని చంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు.
149. పిల్లికి బిచ్చమ్ వేయడు.
150. పిచుక మీద బ్రహ్మాస్త్రం.
151. పిల్లికి ఎలుక సాక్ష్యం.
152. పిచ్చివాడి చేతిలో రాయిలా.
153. పిట్ట కొంచెం కూత ఘనం.
154. పిండి కొద్దీ రొట్టె.
155. పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు.
156. పువ్వు పుట్టగానే పరిమళించును.
157. పుస్తకాల పురుగు.
158. పుండు మీద కారం చల్లినట్లు.
159. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు.
160. పెరుగుట తరుగుట కొరకే.
161. పెళ్ళికి, శ్రద్ధాంజలి కి ఒకటే మంత్రం చదివాడంట.
162. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు.
163. పైసా పని లేదు దమ్మిడి ఆదాయం లేదు.
164. పొరుగింటి పుల్లకూర రుచి.
165. పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు.
166. పోరాని చోట్లకు పొతే రారాని మాటలు రాకపోవు.
167. పందిరి గుంజకి పని చెప్పినట్టు.
168. పట్టపగలే చుక్కలు చూపించినట్టు.
169. పిండి కొలది రొట్టె.
170. పండిత పుత్రః పరమ శుంఠహ.
171. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.
172. పల్లేరు చెట్లలో ఒక జిల్లేడు చెట్టు.
173. పలకకుండా ఉంటే పదిటికి మేలు.
174. పట్టిందల్లా బంగారమే.
175. పిట్ట కొంచెం కూత ఘనం.
176. పిండి బంగారం పోగా పిడకల కొచ్చింది.
177. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణభయం.
178. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.
180. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు.
181. పూజకు పనికిరాని పువ్వు.
182. పాము పుట్టలో చెయ్యి పెట్టినట్టు.
183. పులి నోట్లో తల పెట్టినట్టు.
184. పాముకి పాలు పోసి పెంచి నట్టు.
185. పద్మవ్యూహంలో అర్జునుడు.
186. పొమ్మనలేక పొగ పెట్టినట్లు.
బ అక్షరం తో Telugu Samethalu in Telugu language
187. భరించువాడే భర్త.
188. బాల్చీ తన్నెయ్యడం.
189. బ్రతికుంటే బలుసాకు తినవచ్చు.
190. భయంలేని కోడిపెట్ట బజార్లో గుడ్డు పెట్టినట్లు.
191. బావిలో కప్పలా.
192. బూడిదలో పోసిన పన్నీరు.
193. బెల్లం కొట్టిన రాయిలా.
194. బోడిముండకి మంగళహారతి ఒకటి.
195. బురదలో రాయేసినట్టు.
196. భోలా శంకరుడు.
మ అక్షరం తో Telugu Samethalu Whatsapp కోసం
197. మనిషికి ఒక మాట గొడ్డుకి ఒక దెబ్బ.
198. మనిషికి మాటే అలంకారం.
199. మంచివాడు మంచివాడు అంటే మంచమెక్కి గంతులేసాడంట.
200. మజ్జిక్కి గతిలేకుంటే పెరుగుకి చీటీ రాసినట్టు.
201. మంత్రాలు తక్కువ తుంపర్లు ఎక్కువ.
202. మంచికి పొతే చెడెదురైనట్లు.
203. మనిషొకటి తలిస్తే దేవుడొకటి తలిచాడంట.
204. మంత్రాలకు చింతకాయలు రాలవు.
205. మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్లు.
206. మాటలు చూస్తే కోటలు దాటుతాయి.
207. మీ నాయనది ఏమైనా మిరియాల పడవ మునిగింది.
208. ముందు నుయ్యి వెనక గొయ్యి.
209. మొరిగే కుక్క కరవదు.
210. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.
211. ముందుంది ముసళ్ళపండుగ.
212. మచ్చలేని చందమామ.
213. మిడతల దండు పొలం పై పడ్డట్టు.
214. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు.
215. మొదలే కోతి ఆపై కల్లు తాగింది.
216. ముక్కుమీద కోపం ముందరకాళ్ళకు బంధం.
217. ముద్ద కూటికి తాళం కొట్టేవాడు.
218. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు.
219. మూన్నాళ్ళ ముచ్చట.
220. మూసుని ముత్యం పాచిన పగడం.
221. మేక వన్నె పులి.
222. మేసే గాడిదను కూసే గాడిద చెడిపినట్టు.
223. మెరిసేదంతా బంగారం కాదు.
224. మొదటికే మోసం.
225. మొగుడు పొయ్యి మొత్తుకుంటుంటే మిండగాడు రాయి వేసినట్టు.
226. మొదుల్లేదురా మొగుడా అంటే మీసాలకు సంపంగి నూనె అన్నాడట.
227. మొదుల్లేదురా మొగుడా అంటే పేసలపప్పు పెళ్ళామా అన్నాడట.
228. మొండివాడు రాజుకన్నా బలవంతుడు.
229. మొక్కై వంగనిది మానై వంగునా.
230. మొహమాటానికి పొతే కడుపు అయ్యిందట.
231. మొరిగే కుక్క కరవదు.
232. మోసేవాడికి తెలుసు కావడి బరువు.
ర అక్షరం తో Telugu Samethalu
233. రంకు నేర్చినమ్మ బొంకు నేర్చదా అన్నట్లు.
234. రామేశ్వరం వెళ్లిన శనేశ్వరం వదలనట్లు.
235. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా.
236. రామాయణం మొత్తం విని సీత రామునికి ఏమైద్ది అన్నట్లు.
237. రాను వచ్చింది పోను పొయ్యింది రాగులిసిరి సంగటి చెయ్యమన్నాడంట.
238. రెండు పడవల మీద కాలు పెట్టడం.
239. రోలువచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్లు.
240. రెండిళ్ళ పూజారి.
241. లేడికి లేచిందే పరుగు.
వ అక్షరం తో Telugu Samethalu
242. వడ్ల గింజలో బియ్యపు గింజ.
243. వడ్డీకిచ్చి తెడ్డు నాకినట్టు.
244. వాపును చూసి బలము అనుకున్నాడంట.
245. వింటే భారతమే వినాలి తింటే గారెలే తినాలి.
246. విత్తుగొట్టి విరసంబలి గాచి ఇంటికి ఇదరిలెక్కన పిలిచాడంట.
247. వినేవాడు వెర్రివెంగళప్ప అయితే చెప్పేవాడు వేదాంతట.
248. వీధి విసురు కుంట దోవ కసురు కుంట పోయినట్టు.
249. విడిచిపెట్టింది వీధికి పెద్ద.
250. వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు.
స మరియు శ అక్షరాలతో Telugu Samethalu
251. సంకలో పిల్లోన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్లు.
252. సిగ్గు విడిస్తే శ్రీరంగమే.
253. సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి.
254. సొమ్మొకడిది సోకొకడిది.
255. సూదిలా వచ్చి దబ్బనములా తేలాడు.
256. సముద్రమంతా ఈది పిల్ల కాలువలో పడి చచినట్టు.
257. సముద్రంలో కాకి రెట్ట లాంటిది.
258. సూర్యుడు తూర్పున అస్తమించునా.
259. శనగలుతిని చేయి కడుగుకొన్నట్లు
260. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు.
Related topic: Read 100 samethalu here with the meaning