బొమ్మిడాల చేప ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరుకుతుంది ఇది పొడవాటి శరీరం కలిగి నీటిలో లోతైన ప్రాంతంలో బురదలో కూరుకొని జీవిస్తూ ఉంటుంది. ఇవి ఎక్కువగా మంచినీటి కుంటలలో దొరుకుతాయి. ఈ చేపలను పట్టడానికి కుంటలలోనూ చెరువులలోనూ నీటిని తోడి బురదలో వీటిని వెతికిపట్టుతారు. దీనిని బురద చేప అని కూడా అంటారు. దీనికి జారిపోయే గుణం ఎక్కువగా ఉండటం వలన దీనిని పట్టుటకు జాలర్లు చాలా కష్టపడతారు. ఈ చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఇవి ఆకారంలో పామును పోలి ఉంటాయి. తల పొడవుగా ఉండీ…ముందు భాగం మొనతెలి ఉంటుంది. వీటికి ఇలా తలభాగం ఉండడం వల్ల ఆ చేపలు చాలా సులువుగా బురదలో చొచ్చుకుని ఎక్కువ లోతు వరకు ప్రయాణం చేయగలవు.
Bommidala Fish in English:
The “Bommidala fish” is frequently called as the “Eel fish” in English. Eel fish is a common term for various species of freshwater and marine water eels, characterized by their elongated bodies and snake-like appearance.
ఇది మంచి పోషక పదార్థాలను కలిగి ఉన్న చేప. దీనిని అన్ని రకాల వ్యక్తులు అంటే ముసలి వారు కానీ పిల్లలు కానీ ఎటువంటి సందేహం లేకుండా ఆహారంగా తీసుకోవచ్చు. ఇది ప్రాచీన కాలం నుంచి మంచి చేప ఆహారంగా మన సమాజంలో పేరుపొంది ఉంది. దీని పేరు ప్రాంతాలను బట్టి వేరు వేరుగా పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో దీనిని బొమ్మిడాల (Bommidala) అని మరికొన్ని ప్రాంతాలలో దీనిని బొమ్మిడాయి (Bommidai / Bommidayi) అని ఇంకొన్ని ప్రాంతాలలో దీనిని జారుడు చేప అని పిలుస్తారు.
BUY BEST FISH CUTTING KNIFE ONLINE
కొన్ని బొమ్మిడాల చేపలు సముద్రంలోనూ విరివిగా లభిస్తాయి. అవి చూడడానికి బొమ్మిడాల లానే ఉంటాయి. రుచి కూడా వీటిని పోలి ఉంటుంది… కానీ సముద్రంలో దొరికే వాటితో పోలిస్తే నీటిలో దొరికే బొమ్మిడాల చేప ఆకారంలో చాలా చిన్నదిగా ఉంటుంది. సముద్రంలో దొరికే బొమ్మిడాల చేప చాలా పొడవుగాను.. రుచిలో కొంచెం తేడాఉంటుంది. ఈ బొమ్మిడాల చేపలు అన్ని రకాల మార్కెట్లలో మనకు లభిస్తాయి వీటి ధర చాలా వరకు అన్ని చేపలతో పోలిస్తే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. వీటిని జాలర్లు వారి నివాసాల దగ్గర ఎక్కువగా కొలతల రూపంలో అమ్ముతారు… అంటే తూకం వేయకుండా ఒక కప్పుతో కొలిచి పాత బట్టలో కట్టి మూటకు ధర కట్టి అమ్ముతారు.
Bommidala Pulusu Recipe
- బొమ్మిడాల పులుసు కు కావలసిన పదార్థాలు.
- బాగా కడిగి ఆరబెట్టుకున్న ఒక కేజీ చాప ముక్కలు.
- తగిన మోతాదులో నూనె.
- ఉల్లిపాయలు ఒక కప్పు.
- తగినంత ఉప్పు.
- కరివేపాకు ఒక మండ.
- పసుపు 1/4 టీ స్పూన్.
- 3 నుంచి 4 టమోటాలు.
- ధనియా పౌడర్ 2 నుంచి 3 స్పూన్లు.
- గరం మసాలా 1 లేదా 2 స్పూన్లు.
- కారంపొడి 4 లేదా 5 స్పూన్లు.
- ధనియా ఆకులు కొన్ని.
- తెల్ల గడ్డలు కొన్ని పాయలు.
Process for Eel Fish Recipe In Telugu
ముందుగా ఒక పాన్ లో తగిన మోతాదులో నూనెను వేసుకుని అందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలను దోరగా ఫ్రై చేసి…. దానిలో ఒక స్పూను గార్లిక్ పేస్ట్, కొన్ని కరివేపాకు ఆకులుని వేసి… బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసి…. మూత పెట్టి… కొంచెం సేపు నూనెలో మరగనివ్వాలి.
బాగా మరిగిన తర్వాత మూత తీసి అందులో రెండు లేదా మూడు గ్లాసుల చింతపండు పులుసును ఆడ్ చేయాలి. చింతపండు పులుసును బాగా మరిగిన మసాలాలో కొంచెం సేపు ఉడకనిచ్చి అందులో రెండు లేదా మూడు స్పూన్ల ఎర్ర కారమును యాడ్ చేసి ఒక స్పూను పసుపును కూడా యాడ్ చేయాలి.
బాగా మరిగిన పులుసుకు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బొమ్మిడాయాలా ముక్కలను అందులో వేసి మూత పెట్టాలి. అలా పది నిమిషాలు తర్వాత మూత తీసి అందులో కొంచెం ధనియాల పొడిని మిరియాల పొడిని గరం మసాలాను వేసి తగిన ఉప్పును అందులో ఉన్నట్లుగా చూసుకోవాలి.
చివరగా… మనము ముందుగా తురుముకున్న కొత్తిమీర ఆకులను అందులో వేసి ఒక నిమిషం పాటు మూత పెట్టి పులుసు దగ్గరగా వచ్చేవరకు మరగబెట్టుకొని దించేసుకోవాలి. అంతేనండి మనకు గుమగుమలాడే మంచి రుచి కరమైన బొమ్మిడాయిల పులుసు తయారైనట్లే.
ఇలా తయారు చేసుకున్న బొమ్మిడాయిల పులుసుని వేడివేడి అన్నంలో కలుపుకుని తిని చూడండి చాలా రుచిగా అనిపిస్తుంది…. ఇంకొక విషయం ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ చేపల పులుసును ఒకరోజు పాటు జాగ్రత్తపరిచి మరుచటి రోజున తినిన ఎడల ఇంకా రుచిగా అనిపిస్తుంది.
Facts about Eel Fish
ఈ బొమ్మిడాల చేపలు మొత్తం 1000 రకాలు ఉన్నాయి. వీటిలో చాలావరకు చిన్నపాటి చాపలను తిని జీవించే రకాలు. సముద్రంలో ఉండే ఈ బొమ్మిడాల ఫిష్లు వాటికంటే ఆకారంలో చిన్నవైనా చేపలను ఆహారంగా తీసుకొని జీవిస్తూ ఉంటాయి. . వీటి పెరుగుదల క్రమంలో చాలా మార్పులు జరుగుతూ అవి పెరిగే కొద్దీ ఆకారాన్ని లావు కంటే పొడవుగా పెంచుకుంటాయి.
ఇవి వాటి గుడ్ల నుండి బయటకు వచ్చినప్పుడు అవి తోక కప్పల రూపంలో ఉండి వాటి పరిసరాలలో జీవించే చేపల యొక్క తేలుతున్న కళేబరాలను తింటూ లేదా చనిపోయినా చేపను ఆహారంగా తీసుకుంటూ యుక్త వయసుకు చేరుకుంటాయి. తమకు వేటాడే వయసు రాగానే వాటికంటే ఆకారంలో చిన్నగా ఉన్నా చేపలను చంపి తింటాయి.
ఇవి మన మార్కెట్లో 50 గ్రాముల బరువు నుంచి 7 కిలోల బరువు వరకు ఒకే చేప లభిస్తుంది. ఇవి ఇతర దేశాలలో అధిక రేటుతో తక్కువ మోతాదులో లభిస్తాయి. అందుకని వీటికి మన దేశంలో పోలిస్తే ఇతర దేశాలలో గిరాకి బాగా ఉంటుంది.
దీని యొక్క శాస్త్రీయ నామం “యాంగ్విల్లా యాంగ్విల్లా”. ఇది చాలా దృఢమైన చేప ఇది తక్కువగా ఆక్సిజన్ లభించే ప్రాంతాలలో కూడా అధికంగా లభిస్తుంది ఇది బురదలోనే కాకుండా లోతైన ఇసుక ప్రాంతాలలో కూడా జీవించగలదు.
యూరప్ దేశాలలో ఈ చేపను ఎక్కువగా క్రిస్మస్ సీజన్లో అధికమవుతాదులో చేపల మాంసం గా ఉపయోగిస్తారు. దీనిని అనేక రకాలుగా వండుకొని తింటారు. ఈ చేప రుచి వలన స్పెయిన్లో ఈ చేపకు క్రిస్మస్ సీజన్లో తినే ఏడు రకాల చేపలలో మూడవ స్థానం దక్కింది.
ఈ ఎల్ ఫిష్ వెనుక వైపుకు మరియు ముందుకు ఈత గలదు. దీని నోరు పొడవుగా ఉండి తెరిచినప్పుడు ఇతర చాపలను తినగలిగే పళ్ళను కలిగి ఉంటుంది. ఈ చేప జాతికి చెందిన కొన్ని రకాల చాపలు తాకితే విద్యుత్ షాక్ ని కూడా ప్రసరింప చేయగలవు. వీటిని తాకిన కొన్ని చాపలు మరణానికి కూడా గురి అవుతాయి.
Health Benefits of Bommidala Fish
ఈ చేపలో ఎక్కువ మోతాదులో విటమిన్ A, విటమిన్ B12 విటమిన్ D, మరియు విటమిన్ E లు అధిక మోతాదులో లభిస్తాయి. అన్ని చేపలలో మనకు దొరికినట్లే ఇందులో కూడా ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఆలోచించదగ్గ మోతాదులో లభిస్తాయి. వీటి యొక్క మాంసంలో కొవ్వు పదార్థాలు బాగా లభిస్తాయి.
ఈ చేప మాంసాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మనుషులలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు బలిష్టి అవుతాయి. ఇందులో లభించే పోషక పదార్థాలు ఇంచుమించు మనకు కోడి మాంసం లోను లేదా ఇతర మాంస హారంలో లభించే వాటితో పోలిస్తే సమానంగా ఉంటాయి. ఈ చేపలు అధికమవుతాదులు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్ ఉండడం వల్ల దీనిని శాస్త్రవేత్తలు మంచి ఆహారంగా భావిస్తారు. కానీ కొన్ని దిశలలో చూస్తే ఇది కొంతవరకు హాని కూడా కలిగిస్తుంది. సముద్రంలో దొరికే ఈ చేపల రకాలలో కొంత మోతాదులో విషపూరిత పదార్థాలు ఇమిడి ఉంటాయి. కొంతమంది శాస్త్రవేత్తలు వీటిలో మనిషిని చంపగలిగే విషపూరిత పదార్థాలు కూడా ఉన్నాయని ప్రయోగాల ద్వారా గుర్తించారు.
అమెరికన్ ప్రెగ్నెన్సీ అసోసియేషన్ కొన్ని పరిశోధనల ద్వారా వీటిలో హాని కలిగించే పదార్థాలు ఉన్నాయి కాబట్టి వీటి మాంసానికి గర్భిణీలు దూరంగా ఉంచడమే మంచిదని సలహా ఇచ్చారు. మంచినీటిలో నివసించే ఈ చేపల రకాలలో చాలా తక్కువ మోతాదులో విషపూరిత పదార్థాలు ఉంటాయి.
కొన్ని రకాల చేపలలో మెర్కురి అనే విషపూరిత పదార్థం ముఖ్యంగా సముద్రంలో జీవించే చేపలలో ఉంటుంది. ఈ పదార్ధము జీవి శరీరంలో కొన్ని రకాల జీవక్రియలను నిర్మూలించి ఆ జీవి యొక్క మరణానికి దారితీస్తుంది. కాబట్టి మెర్క్యూరీ లేని చేపల మాంసాన్ని తీసుకోవడం చాలా అవసరం. ఈ చేపలు ఇప్పటివరకు జరిగిన ప్రయోగాల ప్రకారం మెర్కురి విష పదార్థము చాలా తక్కువ మోతాదులో అంటే… మానవునికి లేదా ఈ చేపను ఆహారంగా తీసుకున్న జీవికి ఎటువంటి హానికలగని అంత మోతాదులో ఉందని బయటపడింది. కాబట్టి ఈ చేపను ఆహారంగా తీసుకోవడం వల్ల ముఖ్యంగా మంచినీటిలో ఉన్న చేపను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎటువంటి హాని కలగదు. చేప మాంసాన్ని ఆహారంగా పరిగణించడానికి ముఖ్య ఉద్దేశం చేపల మాంసంలో ఉన్న పోషక పదార్థాలు. అందులోనూ…. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్… ఇవి జీవికి కావాల్సిన ఫ్యాటీ ఆసిడ్స్ ని అందిస్తాయి ఈ ఒమేగా-3 ఫ్యాటీ ఆ సీడ్స్, మన శరీరంలోని జీవ రసాయన క్రియలు సక్రమంగా జరగడానికి అవసరమవుతాయి. మన శరీరానికి అంటే బాహ్యంగా మరియు అంతర్గతంగా చేపల మాంసం వల్ల మంచి లక్షణాలు కనిపిస్తాయి.
మీకు నా వివరణ నచ్చినట్లైతే దయచేసి నా యూట్యూబ్ ఛానల్ (MYSY Media) ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మేము మన ఆరోగ్యానికి సంబంధించే మంచి విషయాలను వీడియోల రూపంలో మీకు అందిస్తాము.
Takeaways:
- Eel fish meat improves overall body health as it contains high nutrient value among the fish meat available in the market.
- Consuming fish meat provides not only strong immunity but also good skin glow and eye vision.
- Most people prefer fish meat to poultry meat as it possesses more amount of omega-3 fatty acids, which play a crucial role in human metabolism.
- Fish meat contains not only unsaturated fat but also some important minerals, vitamins, and essential amino acids.
- Some research studies proved that consuming fish meat increases life span and reduces the risk of getting chronic diseases like hormonal problems, cancer, etc.
You may like reading these posts.